'హిట్ 2' డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన వెంకటేశ్?
- ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్న వెంకీ
- చివరిగా చేసిన సినిమా 'ఓరి దేవుడా'
- నెక్స్ట్ ప్రాజెక్టు డైరెక్టర్ గా శైలేశ్ కొలను
- క్రైమ్ థ్రిల్లర్ కథకి వెంకీ ఓకే చెప్పాడంటూ టాక్
నిజానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేశ్ ఒక సినిమా చేయాలనుకున్నారు. అలాగే 'జాతిరత్నాలు' డైరెక్టర్ అనుదీప్ తోను ఒక సినిమా చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టులు సెట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు శైలేశ్ కొలను పేరు తెరపైకి వచ్చింది.
'హిట్ 2' సినిమాతో సక్సెస్ ను అందుకున్న శైలేశ్, ఆ తరువాత 'హిట్ 3' చేస్తాడనే అంతా అనుకున్నారు. కానీ ఈ మధ్యలోనే ఆయన మరో క్రైమ్ థ్రిల్లర్ ను పట్టాలెక్కించే పనిలో ఉన్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో కథానాయకుడిగా ఆయన వెంకటేశ్ ను అనుకోవడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని చెబుతున్నారు. సురేశ్ బాబు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారని అంటున్నారు.