'పఠాన్' చిత్రంలో దీపిక భారీ ఎక్స్ పోజింగ్.. బాయ్ కాట్ సెగ.. షారుఖ్ ఫొటోలు, దిష్టిబొమ్మలు దగ్ధం!
- షారుఖ్, దీపికా పదుకుణే జంటగా 'పఠాన్' చిత్రం
- 'బేషరమ్' పాటలో బికినీలలో హాట్ గా నటించిన దీపిక
- అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం
ఈ చిత్రంలో షారుఖ్ సరసన దీపికా పదుకుణే నటించింది. ఈ సినిమాలోని 'బేషరమ్' సాంగ్ ను ఇటీవలే విడుదల చేరారు. ఈ పాటలో దీపిక బికినీలు ధరించి, చాలా హాట్ గా నటించింది. భారీ ఎక్స్ పోజింగ్ చేసింది. ఈ పాటపై సంప్రదాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ, అభ్యంతరకర సన్నివేశాలను తొలగిస్తేనే రాష్ట్రంలో సినిమా ప్రదర్శనకు అనుమతిని ఇస్తామని, లేకపోతే నిషేధం తప్పదని హెచ్చరించారు. మరోవైపు దీపిక కాషాయ రంగు బికినీ ధరించడం కూడా బీజేపీ శ్రేణులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో షారుఖ్ ఫొటోలను, దిష్టిబొమ్మలను నిరసనకారులు దగ్ధం చేశారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.