Neelima Guna: దర్శకుడు గుణశేఖర్ కుమార్తె వివాహ రిసెప్షన్ లో తారాతోరణం

  • ఈ నెల 3న నీలిమ గుణ వివాహం
  • వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో వివాహం
  • ఆదివారం నాడు రిసెప్షన్
  • హాజరైన అల్లు అర్జున్, మహేశ్ బాబు
  • సందడి చేసిన రాజమౌళి, జీవిత-రాజశేఖర్
Tollywood stars attends Neelima Guna wedding reception

టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ కుమార్తె నీలిమ వివాహం ఇటీవల వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో జరిగింది. కాగా, ఆదివారం నాడు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ అగ్ర తారలు తరలిరావడంతో భారీ సందడి నెలకొంది. 

సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రాజమౌళి-రమ, రాఘవేంద్రరావు, రాజశేఖర్, జీవిత దంపతులు, సంగీత దర్శకుడు మణిశర్మ, సీనియర్ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు రిసెప్షన్ కు విచ్చేసి నూతన వధూవరులు నీలిమ, రవిలను ఆశీర్వదించారు. అటు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి కూడా ఈ రిసెప్షన్ కు హాజరయ్యారు.

More Telugu News