ప్రజా సమస్యలు పట్టించుకోకుండా సమైక్య రాష్ట్రంపై ప్రకటనలా?: చంద్రబాబు
- సమైక్యాంధ్రపై సజ్జల వ్యాఖ్యలు
- ప్రజలను మభ్యపెట్టడం మోసపూరితం అన్న చంద్రబాబు
- విభజన కంటే వైసీపీ పాలనతోనే ఏపీకి నష్టం అని వెల్లడి
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరగడం ఆందోళనకరం అని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో వ్యవసాయరంగంలో రికార్డులు సాధించామని చంద్రబాబు అన్నారు. వైసీపీ రైతు వ్యతిరేక విధానాల వల్లే అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చేసిన తప్పులను ప్రభుత్వ పెద్దలు సరిదిద్దుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. సత్వరం స్పందించి అన్నదాతలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.