సీఎం కేసీఆర్ కంటే నేనే ఎక్కువ చదువుకున్నా: రసమయి బాలకిషన్
- కరీంనగర్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
- ఎమ్మెల్యేగా ఉంటూనే డాక్టరేట్ సాధించానన్న రసమయి
- ఉపాధ్యాయ వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చానన్న ఎమ్మెల్యే
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఉపాధ్యాయ వృత్తి చేపట్టేందుకు అంబేద్కర్ ఆలోచనా విధానమే కారణమన్నారు. ఎంఏ, ఎంఫిల్, బీఎడ్ చదివి ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన తాను గోచి, గొంగడి పెట్టుకుని పాటలు కూడా పాడానని అన్నారు. ఆ తర్వాత ప్రజా సేవ కోసం ఉద్యోగాన్ని వదులుకున్నానని అన్నారు. అంబేద్కర్ మాదిరిగానే తాను కూడా చదువుకుని డాక్టరేట్ సాధించానని, గోల్డ్ మెడల్ అందుకున్నానని బాలకిషన్ అన్నారు.