మహిళా అంపైర్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం
- పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు
- మహిళలకు అంపైర్లుగా అవకాశం కల్పించిన బీసీసీఐ
- త్వరలో జరగనున్న రంజీ ట్రోఫీలో కనిపించనున్న విమెన్ అంపైర్స్
మన దేశంలో ప్రస్తుతం గాయత్రి, జనని, వృందారతి అనే మహిళా అంపైర్లు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మహిళా అంపైర్ల సంఖ్యను మరింత పెంచాలని బీసీసీఐ నిర్ణయించింది. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్ లో సైతం మహిళా అంపైర్లు కనిపిస్తారని బీసీసీఐ అధికారులు తెలిపారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.