నక్సల్స్ వద్ద అమెరికా తుపాకీ... స్వాధీనం చేసుకున్న పోలీసులు

Police found US made rifle at Maoists
  • ఇటీవల బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్
  • నలుగురు మావోయిస్టుల హతం
  • ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • ఆయుధాల్లో అమెరికా తయారీ ఎం1 కార్బైన్
కొన్నిరోజుల కిందట చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భీకర ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ సందర్భంగా ఘటన స్థలంలో మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఆ ఆయుధాల్లో అమెరికా తయారీ తుపాకీ కూడా ఉండడం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఇది రెండో ప్రపంచ యుద్ధం నాటి తుపాకీ. దీన్ని ఎం1 కార్బైన్ తుపాకీగా పిలుస్తారు. దీన్ని అమెరికా బలగాలు రెండో ప్రపంచ యుద్ధంలోనూ, వియత్నాం యుద్ధం, కొరియా వార్ లోనూ ఉపయోగించాయి. ఎం1 కార్బైన్ తుపాకీ బ్యారెల్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఇతర అస్సాల్ట్ తుపాకులతో పోల్చితే దీని నిర్వహణ, వినియోగం చాలా సులభం అని పోలీసులు తెలిపారు. 

అయితే ఈ అమెరికా తుపాకీ నక్సల్స్ కు ఎలా అందిందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తుపాకీపై ఉండే సీరియల్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేయనున్నారు.
Go Back to Shorts
M1 Carbine
US Rifle
Maoists
Bijapur
Police
Chhattisgarh

More Telugu News