ప్రపంచంలో తిరుగులేని నేతగా మరోసారి మోదీ
Add ap7am to your home Screen

ప్రపంచంలో తిరుగులేని నేతగా మరోసారి మోదీ

Modi tops the list of global leaders
  • 77 శాతం రేటింగ్ తో ప్రపంచ స్థాయి నేతల్లో మోదీ అగ్రస్థానం
  • రెండో స్థానంలో ఆస్ట్రేలియా ప్రధాని
  • మూడో స్థానంలో నిలిచిన అమెరికా అధ్యక్షుడు బైడెన్
ప్రపంచంలో తిరుగులేని నేతను తానేనని భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారు. ప్రపంచ స్థాయి నేతల్లో మరోసారి తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రపంచంలోని గొప్ప నేతల జాబితాలో 77 శాతం రేటింగ్ తో టాప్ లో నిలిచారు. 56 శాతం రేటింగ్ తో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటొనీ రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (41 శాతం రేటింగ్- మూడో స్థానం), కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో (38 శాతం రేటింగ్- నాలుగు), బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (36 శాతం రేటింగ్- ఐదు ), జపాన్ ప్రధాని కిషిండా (23 శాతం రేటింగ్- ఆరు) నిలిచారు. 

ఈ సర్వేను మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ నిర్వహించింది. 22 దేశాల అధినేతల రేటింగ్స్ తో ఈ సంస్థ జాబితాను విడుదల చేసింది. ఈ సంస్థ ప్రభుత్వాలు, నేతల తీరును ట్రాక్ చేస్తుంటుంది. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో కూడా మోదీ 75 శాతం రేటింగ్ తో తొలి స్థానంలో నిలిచారు. తాజా సర్వేలో మోదీ రేటింగ్ మరో 2 శాతం పెరగడం గమనార్హం.
Narendra Modi
Global leader List
BJP

More Telugu News