Adivi Sesh: 'ఉరికే ఉరికే మనసే ఉరికే' .. 'హిట్ 2' సాంగ్ రిలీజ్

Hit 2 song released
షార్ట్స్‌లో చూడండి
గతంలో విష్వక్సేన్ హీరోగా 'హిట్' సినిమాను నిర్మించిన నాని, ఇప్పుడు అడివి శేష్ హీరోగా 'హిట్ 2' సినిమాను నిర్మించాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా రూపొందింది. అడివి శేష్ జోడీగా మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమాకి ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్ని సమకూర్చారు. తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ లాంచ్ ఈవెంటును హైదరాబాదులోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో నిర్వహించారు.

ఈ వేదికపై అడివి శేష్ మాట్లాడుతూ .. "నేను 'మేజర్' చేస్తున్న సమయంలోనే 'హిట్ 2' ప్రాజెక్టు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని చెప్పేసి శైలేశ్ కొలను వినిపించాడు. ఈ సినిమాలో నేను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాను. నా డైలాగ్ డెలివరీలో కాస్త వెటకారం ఉండేలా ఆ పాత్రను శైలేశ్ కొలను డిజైన్ చేశాడు. అందువలన ఆ పాత్ర మీకు ఇంకాస్త కొత్తగా అనిపిస్తుంది" అన్నాడు. 

థ్రిల్లర్ నేపథ్యంలో కథలను చేయడం నాకు అలవాటే. కాకపోతే క్యారెక్టరైజేషన్ లోని కొత్తదనం వలన, ఈ పాత్రకు నేను సెట్ అవుతానా? అనే డౌటు వచ్చింది. నువ్వు మాత్రమే సెట్ అవుతావు అంటూ నాతో శైలేశ్ ఈ పాత్రను చేయించాడు. ప్రస్తుతం నాని 'దసరా' సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ఆయన నిర్మించిన 'హిట్ 2' సినిమా డిసెంబర్ 2వ తేదీన రిలీజ్ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Adivi Sesh
Meenakshi Choudary
Hit2 movie

More Telugu News