అగ్రవర్ణ పేదలకు 10 శాతం 'ఈడబ్ల్యూఎస్' రిజర్వేషన్లను సమర్థించిన సుప్రీంకోర్టు
- 2019 ఎన్నికలకు ముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కల్పించిన కేంద్రం
- ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు
- ఈ రిజర్వేషన్ల కల్పనలో వివక్ష లేదన్న సుప్రీంకోర్టు
2019 ఎన్నికలకు ముందు ఈ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లను కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లను కల్పించింది. ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.