రాష్ట్ర ఆదాయాన్ని పెంచి.. సంపదను పేదలకు పంచడమే కేసీఆర్ లక్ష్యం: గంగుల
- కేసీఆర్ ఎన్నో గొప్ప పథకాలను అమలు చేశారన్న గంగుల
- పేదింటి అమ్మాయిల పెళ్లిళ్లకు అండగా నిలుస్తున్నారని కితాబు
- పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్న మంత్రి
పేదింటి అమ్మాయిల వివాహాలకు అండగా నిలవాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప అని చెప్పారు. అన్నగా, మేనమామగా పేద ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. పేద ఆడబిడ్డలకు పెళ్లయిన నెల రోజుల్లోనే చెక్కులు అందిస్తున్నామని చెప్పారు. ఉన్నత వర్గాలకు దీటుగా మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల్లో ప్రతి పేది విద్యార్థికి సంవత్సరానికి రూ. 1.25 లక్షలు వెచ్చింది నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు.