పవన్ కల్యాణ్ కు హాని తలపెడితే బీజేపీ చూస్తూ ఊరుకోదు: సోము వీర్రాజు
- ఏపీలో మిత్రపక్షాలుగా కొనసాగుతున్న బీజేపీ, జనసేన
- పవన్ ఇంటి వద్దకు అపరిచితులు వచ్చారన్న వార్తపై స్పందించిన వీర్రాజు
- అపరిచితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ ఇంటి వద్దకు రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి.. పవన్ బౌన్సర్లతో గొడవ పడ్డ వైనాన్ని ఈ సందర్బంగా వీర్రాజు ప్రస్తావించారు. పవన్ ఇంటి వద్దకు వచ్చిన అపరిచితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కు పొంచి ఉన్న ముప్పుపై సోము వీర్రాజు స్పందించారన్న వాదన వినిపిస్తోంది.