ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శుక్రవారం శుభవార్త?
- ఇరాన్‌తో శాంతి చర్చలపై ట్రంప్ ఆశాభావం
- శుక్రవారం శుభవార్త ఉండొచ్చన్న అమెరికా అధ్యక్షుడు
- ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన ఇరాన్
- చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టీకరణ
అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌కు అనుబంధంగా పనిచేసే 'తస్నీమ్ న్యూస్' ఏజెన్సీ ఈ మేరకు 'ఎక్స్'లో ఓ పోస్ట్ చేసింది. "ట్రంప్ మళ్లీ అబద్ధం చెప్పారు. శుక్రవారం చర్చలు జరిపే అంశంపై ఇరాన్‌కు ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం లేదు" అని స్పష్టం చేసింది.
శాంతి చర్చలకు మరింత సమయం ఇచ్చేందుకు అమెరికా ప్రకటించిన కాల్పుల విరమణను ట్రంప్ పొడిగించారు.
ఈ వ్యూహ మార్పునకు పాకిస్థాన్ నాయకత్వంతో జరిపిన సంప్రదింపులే కారణమని ట్రంప్ పేర్కొన్నారు. "ఇరాన్ ప్రభుత్వం అంతర్గతంగా తీవ్రంగా చీలిపోయింది. పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకు.. ఇరాన్ నేతలు ఒక ఏకీకృత ప్రతిపాదనతో వచ్చేవరకు ఆ దేశంపై దాడిని నిలిపివేయాలని నిర్ణయించాం" అని ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. "మా సైన్యాన్ని అప్రమత్తంగా ఉండాలని, దిగ్బంధనాన్ని కొనసాగించాలని ఆదేశించాను. ఇరాన్ ప్రతిపాదన వచ్చేవరకు కాల్పుల విరమణను పొడిగిస్తున్నాను" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.