అడివి శేష్ - శర్వాలను ఇరకాటంలో పెట్టిన బాలకృష్ణ: 'అన్ స్టాపబుల్ 2' ప్రోమో!
Add ap7am to your home Screen

అడివి శేష్ - శర్వాలను ఇరకాటంలో పెట్టిన బాలకృష్ణ: 'అన్ స్టాపబుల్ 2' ప్రోమో!

Unstoppable 2 Update
  • 'అన్ స్టాపబుల్' సీజన్ 2 
  • 3వ ఎపిసోడ్ శర్వానంద్ - అడివి శేష్ లతో
  • ఈ నెల 4వ తేదీన పూర్తి ఎపిసోడ్ 
  • సందడి చేస్తున్న ప్రోమో
'అన్ స్టాపబుల్' సీజన్ 2లో 3వ ఎపిసోడ్ ఈ నెల 4వ తేదీన 'ఆహా'లో పలకరించనుంది. ఈ ఎపిసోడ్ లో శర్వానంద్ - అడివి శేష్ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం రన్ అవుతోంది. శర్వా - శేషు ఇద్దరూ కూడా బ్యాచ్ లర్స్  కావడంతో, ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ మరింత కామెడీగా బాలకృష్ణ ఈ టాక్ షోను నడిపించారనే విషయం ఈ ప్రోమోను బట్టి అర్థమవుతోంది. 

అంతేకాదు, ఈ ఇద్దరినీ కూడా బాలకృష్ణ ఇరకాటంలో పెట్టారనే విషయం కూడా తెలుస్తూనే ఉంది. "బాలకృష .. చిరంజీవి .. నాగార్జున .. వెంకటేశ్ .. ఈ నలుగురిలో ఎవరు నెంబర్ వన్ యాక్టర్?" అంటూ అడగడంతో 'మహాప్రభో' అంటూ ఇద్దరూ కూడా చేతులెత్తేశారు. ''ఏ హీరోయిన్ తో కిస్ వద్దురా బాబూ అనిపిస్తుంది?" అంటూ మరో ప్రశ్నను బాలయ్య సూటిగా సంధించారు. 

ఇక సినిమాలు చేసినప్పుడు ఫ్లాపులు రావడం సహజం. కానీ అసలు సినిమాలే చేయలేని పరిస్థితి వస్తే? అంటూ శర్వానంద్ కి 'జాను' సినిమా షూటింగులో జరిగిన ప్రమాదాన్ని గురించి బాలయ్య ప్రస్తావించారు. అప్పుడు మాత్రం శర్వా కాస్త ఎమోషనల్ అయ్యాడు. సరదాగా .. సందడిగా .. ఎమోషనల్ గా సాగిన ఈ షో పూర్తి ఎపిసోడ్ ను 4వ తేదీన చూడొచ్చు.
Balakrishna
Sharwanand
Adivi Shesh
Unstoppble 2

More Telugu News