హోం మంత్రి కారును తనిఖీ చేసిన పోలీసులు...వీడియో ఇదిగో
- మునుగోడు ఉప ఎన్నికల్లో పేలుతున్న మాటల తూటాలు
- నేతల కార్లలో పెద్ద ఎత్తున నగదు తరలుతోందన్న ఆరోపణలు
- బుధవారం మునుగోడు ప్రచారానికి వెళ్లిన హోం మంత్రి మహమూద్ అలీ
- హోం మంత్రి కారును తనిఖీల కోసం ఆపిన పోలీసులు
- పోలీసుల తనిఖీలకు పూర్తిగా సహకరించిన మహమూద్ అలీ
ఈ క్రమంలో బుధవారం తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మునుగోడు బాట పట్టారు. ఈ సందర్భంగా నిబంధనల మేరకు హోం మంత్రి అయినా కూడా మహమూద్ అలీ కారును ఆపిన పోలీసులు దానిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కారులోనే కూర్చున్న అలీ స్థానిక పోలీసులకు సహకరించారు. పోలీసులు తన కారును క్షుణ్ణంగా తనిఖీ చేసే దాకా వెయిట్ చేసిన అలీ... తనిఖీలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.