బాలయ్య 107వ సినిమా పేరు 'వీరసింహారెడ్డి'... కర్నూలు కొండారెడ్డి బురుజు వేదికగా ప్రకటన
Add ap7am to your home Screen

బాలయ్య 107వ సినిమా పేరు 'వీరసింహారెడ్డి'... కర్నూలు కొండారెడ్డి బురుజు వేదికగా ప్రకటన

veerasimha reddy is the balakrishna 107th movie name
  • రాయలసీమ బ్యాక్ డ్రాప్ గా బాలయ్య సినిమా
  • గతంలో హిట్లుగా నిలిచిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు
  • తాజా చిత్రం కూడా రాయలసీమ నేపథ్యంతోనే తెరకెక్కనున్న వైనం
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ నటించే 107వ సినిమా పేరును చిత్ర యూనిట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వేదికగా ఈ సినిమా పేరును ప్రకటించారు. వీరసింహారెడ్డిగా ఈ సినిమా పేరును ప్రకటించారు. టాలీవుడ్ దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. 

బాలకృష్ణ హీరోగా... రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా గతంలో తెరకెక్కిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలను మరిపించేలా మరోమారు రాయలసీమ నేపథ్యంతోనే బాలయ్య కొత్త చిత్రం తెరకెక్కనుంది.
Tollywood
Kurnool District
Kondareddy Buruju
Balakrishna

More Telugu News