Sasivadane Movie: సుందరమైన కోనసీమలో షూటింగ్ పూర్తి చేసుకున్న 'శశివదనే'

Sasivadane movie completed shooting in Konaseema
షార్ట్స్‌లో చూడండి
రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా తెరకెక్కుతున్న 'శశివదనే' చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కోనసీమలోని అందమైన లొకేషన్లలో 50 రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ ను జరుపుకుంది. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించగా... గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ నిర్మతగా వ్యవహరించారు. రఘు కుంచె, ప్రవీణ్ యండమూరి, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, శ్రీమాన్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషించారు. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ... 'శశివదనే' చిత్రాన్ని కోనసీమలోని సుందరమైన లొకేషన్లలో 50 రోజుల పాటు చిత్రీకరించామని తెలిపారు. అద్భుతమైన అనుభవం, జ్ఞాపకాలను అందించిన కోనసీమకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. సినిమాలోని ప్రేమ సన్నివేశాలు రిఫ్రెష్‌గా ఉండబోతున్నాయని చెప్పారు. 

‘పలాస 1978’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ నటుడు రక్షిత్ అట్లూరి ఈ సినిమాలో కూడా చాలా చక్కని నటనను కనపరిచాడని ప్రశంసించారు. హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా చాలా చక్కగా నటించిందని కితాబునిచ్చారు. దర్శకుడు మోహన్ ఉబ్బర ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని చెప్పారు. ఇందులో ఉన్న ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయని... అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
Go Back to Shorts
Sasivadane Movie
Rakshit Atluri
Komali Prasad
Ahiteja Bellamkonda
Mohan Ubbara
Tollywood
Konaseema

More Telugu News