Nayanthara: చిక్కుల్లో నయనతార... నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష!
ప్రముఖ సినీ నటి నయనతార దంపతులు పెద్ద వివాదంలోనే చిక్కుకున్నారు. తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను నయనతార పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇంత వరకు బాగానే ఉంది. అయితే పెళ్లయిన నాలుగు నెలలకే కవల పిల్లలకు జన్మనిచ్చినట్టు వీరు వెల్లడించారు. సరోగసీ విధానంతో వీరు తల్లిదండ్రులు అయ్యారు. అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడమే సరోగసీ విధానం. దీనిపై 2019లోనే సుప్రీంకోర్టు స్పష్టతను ఇచ్చింది. ఈ పద్ధతి ద్వారా పిల్లలను కనడం నేరమని తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా నయనతార అద్దె గర్భం ద్వారా పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సరోగసీ ద్వారా పిల్లలను కన్నట్టయితే నయనతార, విఘ్నేష్ లకు ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఒకవేళ సరోగసీ ద్వారా కాదు... పిల్లలను దత్తత చేసుకున్నామని చెప్పినా సమస్యలు తప్పవు. పిల్లలను దత్తత తీసుకోవాలంటే లీగల్ గా ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. చట్ట పరంగా దత్తత తీసుకుంటే పర్వాలేదు... లేని పక్షంలో చట్టాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. మరోవైపు ఇంత జరుగుతున్నా నయన్ దంపతులు స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే దీనిపై వివరణ ఇవ్వాలంటూ నయన్ దంపతులకు తమిళనాడు ప్రభుత్వం నోటీసులు పంపింది.