Balakrishna: ఈ నెల 14 నుంచి 'అన్ స్టాపబుల్' సీజన్ 2 .. చంద్రబాబునాయుడుతో మొదలు!

  • బాలయ్య తొలిసారి వ్యాఖ్యాతగా చేసిన 'అన్ స్టాపబుల్'
  • ఈ నెల 14వ తేదీ నుంచి సెకండ్ సీజన్ మొదలు 
  • చంద్రబాబునాయుడుతో ఫస్టు ఎపిసోడ్ 
  • అందరిలో పెరుగుతున్న ఆసక్తి      
Unstoppable 2 Update

'ఆహా'లో బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆ మధ్య మొదలైన 'అన్ స్టాపబుల్' టాక్ షోకి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఫస్టు సీజన్ మోహన్ బాబుతో మొదలై మహేశ్ బాబుతో పూర్తయింది. బెస్ట్ టాక్ షోగా ఈ కార్యక్రమం పేరు తెచ్చుకుంది. హీరోలు,.. హీరోయిన్లు .. దర్శకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా సినిమాలకి సంబంధించిన టీమ్స్ కూడా ఈ వేదికపై సందడి చేశాయి. 

కొంత గ్యాప్ తరువాత ఈ టాక్ షో సెకండ్ సీజన్ ను మొదలుపెడుతున్నారు. ఇటీవలే ఈ షోకి సంబంధించిన టీజర్ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. ఈ సీజన్ లో ఫస్టు ఎపిసోడ్ ను చంద్రబాబునాయుడుతో చేశారు. కుటుంబం పరంగా ... పార్టీ పరంగా బాలకృష్ణ - చంద్రబాబు మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ నెల 14వ తేదీన ఈ ఎపిసోడ్ పలకరించనుంది. 

 సహజంగానే బాలకృష్ణ ఏదైనా ప్రశ్నించడానికి వెనుకాడరు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని ఆయన ముక్కు సూటిగా చెబుతుంటారు. ఇక చంద్రబాబునాయుడు ఏ విషయాన్ని గురించైనా ఆచితూచి మాట్లాడుతుంటారు. అందువలన బాలయ్య - చంద్రబాబు మధ్య నడిచిన ఎపిసోడ్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

More Telugu News