Bollywood: బాలీవుడ్‌లో విషాదం.. ప్ర‌ముఖ న‌టుడి క‌న్నుమూత‌

  • అనారోగ్యంతో  చ‌నిపోయిన అరుణ్ బాలి
  • కొన్నాళ్లుగా అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న అరుణ్‌
  • సినిమా, సీరియ‌ల్స్ లో న‌టించి మెప్పించిన బాలి
Veteran actor Arun Bali passes away at 79 in Mumbai

బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. పలు బాలీవుడ్ చిత్రాల్లో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న ప్రముఖ నటుడు అరుణ్ బాలి చ‌నిపోయారు. 79 ఏళ్ల వయసులో ముంబైలో గురువారం ఆయ‌న‌ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అరుణ్‌కి ఆరోగ్యం బాగోలేదు. ఆయ‌న‌ అరుదైన నాడీ కండరాల వ్యాధి మస్తీనియా గ్రావిస్‌తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని హిర్నందాని ఆసుపత్రిలో చేరారు. అరుణ్ బాలి ఇద్దరు కుమార్తెలు అమెరికాలో ఉంటున్నారు. ఈ రోజు వాళ్లు ముంబై రానున్నారు. ఆ తర్వాత నటుడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

అరుణ్ బాలి..  త్రీ ఇడియట్స్, కేదార్‌నాథ్, పానిపట్, హే రామ్, దండ్ నాయక్, రెడీ, జమీన్, పోలీస్‌వాలా గుండా, ఫూల్ ఔర్ అంగార్, రామ్ జానే వంటి అనేక ఇతర చిత్రాల్లో న‌టించి మెప్పించారు. ఆయా పాత్ర‌ల‌కు న్యాయం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అనేక సినిమాలు, టీవీ సీరియ‌ల్స్ లోనూ ప‌ని చేశారు. అరుణ్ బాలి నిర్మాతగా ప‌లు చిత్రాల‌ను కూడా రూపొందించారు. నిర్మాత‌గా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.

More Telugu News