టీ20 ప్రపంచకప్ అంపైర్ల జాబితాలో మనోడు.. నితిన్ మేనన్‌కు చోటు
- 16 మందితో కూడిన అంపైర్ల జాబితాను విడుదల చేసిన ఐసీసీ
- గత ప్రపంచకప్‌లో సేవలు అందించిన వారికే మళ్లీ చాన్స్
- ఇండియా నుంచి నితిన్ మీనన్‌కు మాత్రమే చోటు
ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 16న శ్రీలంక-నమీబియా మధ్య గీలాంగ్‌లో ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు జోయెల్ విల్సన్, రాడ్నీ టకర్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. పాల్ రీఫెల్ టీవీ అంపైర్‌గా, ఎరాస్మస్ ఫోర్త్ అంపైర్‌గా ఉంటారు. ఎరాస్మస్, టకర్, అలీమ్ దార్‌కు ఇది ఏడో టీ20 ప్రపంచకప్ కాగా, లాంగ్టన్ రుసెరెకు ఇది ఈ ఏడాదిలో రెండో ప్రపంచకప్. ఈ ఏడాది జరిగిన మహిళల ప్రపంచకప్‌లోనూ ఆయన అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఫైనల్‌కు రిజర్వ్ అంపైర్‌గానూ ఉన్నారు.