కేంద్రానికి థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్
- మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ పురస్కారం
- అన్ని గ్రామాల్లోని ఇళ్లకు నాణ్యమైన నీటిని అందిస్తున్నట్టు గుర్తించామన్న కేంద్రం
- పథకం గొప్పదనాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్
ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ఆవాసాలకు తమ ప్రభుత్వం సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్రం గుర్తించడంపై ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. అయితే ఇదే సమయంలో మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫారసులను కూడా కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.