'జిన్నా' రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు!
- మంచు విష్ణు హీరోగా రూపొందిన 'జిన్నా'
- కథానాయికలుగా పాయల్ - సన్నీలియోన్
- అక్టోబర్ 5వ తేదీన ట్రైలర్ రిలీజ్
- 21వ తేదీన సినిమా విడుదల
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. అందువల్లనే క్లారిటీ ఇద్దామని వచ్చాను. అక్టోబర్ 5వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేస్తాము. 21వ తేదీన సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కోసం మేమంతా ఎంతగానో కష్టపడ్డాం. మా కష్టానికి తగినట్టుగా సినిమా ఆడుతుందనే నమ్మకం ఉంది. ఈ రోజు నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచుతున్నాం" అంటూ చెప్పుకొచ్చారు.
జి. నాగేశ్వర రెడ్డి మూలకథను అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ స్క్రీన్ ప్లేను అందించారు. విష్ణు సరసన నాయికలుగా సన్నీ లియోన్ .. పాయల్ అలరించనున్నారు. సునీల్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.