సౌదీ అరేబియా ప్రధానిగా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ను నియమించిన రాజు
- సౌదీ పాలనలో కీలక ఘట్టం
- ఇప్పటిదాకా ప్రధానిగా వ్యవహరించిన రాజు
- తన బాధ్యతలను పెద్ద కొడుక్కి అప్పగించిన వైనం
- ఇతర కుమారులకు కీలక బాధ్యతలు
ఇప్పటివరకు రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సాద్ సౌదీ ప్రధానిగా వ్యవహరించారు. ఇకపై ఆయన బాధ్యతలన్నీ కుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్ కు బదిలీ కానున్నాయి.
మహ్మద్ బిన్ సల్మాన్ ను సంక్షిప్తంగా 'ఎంబీఎస్' అని పిలుస్తారు. ఆయన ఇప్పటిదాకా రక్షణ మంత్రిగా ఉంటూ, దేశ వ్యవహారాలన్నీ తానే చూసుకున్నారు. ఇకపై అధికారికంగా సౌదీ దేశాధినేతగా వ్యవహరించనున్నారు.