వయసు 73.. అనుభవం 45.. సీఎంగా 14.. కుప్పంలో ఓటు లేదు: మంత్రి రోజా వ్యంగ్యం

26-09-2022 Mon 15:37
  • చంద్ర‌బాబుపై మంత్రి రోజా సెటైరిక్ ట్వీట్‌
  • కుప్పంలో చంద్ర‌బాబుకు ఇల్లు కూడా లేద‌ని ఆరోప‌ణ‌
  • చంద్ర‌బాబు పేరు చెబితే గుర్తుకు వ‌చ్చే ఒక్క స్కీమూ లేద‌ని ఎద్దేవా
ap minister rk roja satirical tweet on chandra babu
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడుపై ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా సోమ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న సొంత జిల్లా చిత్తూరులోని కుప్పం నుంచి చంద్ర‌బాబు ఎమ్మెల్యేగా గెలుస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో అస‌లు చంద్ర‌బాబుకు కుప్పంలో ఓటు హ‌క్కే లేని విష‌యాన్ని ప్రస్తావిస్తూ రోజా విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాకుండా చంద్ర‌బాబు పేరు చెబితే... గుర్తుకు వ‌చ్చే ఒక్క‌టంటే ఒక్క స్కీమ్ కూడా లేద‌ని ఆమె పేర్కొన్నారు.

వయసు 73. అనుభవం 45. సీఎంగా 14. కుప్పంలో ఓటు లేదు. ఇల్లు కూడా లేదు. ఆయన పేరు చెపితే గుర్తుకు వచ్చే స్కీము లేదు! వాటే పిటీ బాబూ...? అని రోజా త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఏళ్ల త‌ర‌బ‌డి కుప్పం నుంచి గెలుస్తూ వ‌స్తున్న చంద్ర‌బాబుకు ఓటు హ‌క్కుతో పాటు కుప్పంలో సొంతిల్లు కూడా లేని వైనాన్ని ఆమె ప్ర‌స్తావించారు.