అంటార్కిటికా మంచు మీద ఓనమ్ ముగ్గు.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో ఇదిగో
- కొందరు యువకులు కలిసి గడ్డకట్టిన సముద్రంపై ముగ్గు వేసిన తీరు
- చిన్నపాటి సుత్తెలు, స్క్రూ డ్రైవర్ల వంటి వాటితో మంచును చెక్కి రూపకల్పన
- ‘భారతీయులు ఎక్కడున్నా పండుగలను వదలరు’ అంటూ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
సుత్తెలు, స్క్రూ డ్రైవర్లతో..
- అంటార్కిటికాలో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు ఉంటాయి. మంచు బాగా గడ్డకట్టి ఉంటుంది. అలా సరస్సులాంటి దానిపై గడ్డకట్టిన మంచుపై కొందరు యువకులు ఓనమ్ ముగ్గును చెక్కారు.
- ఇందుకోసం చిన్నపాటి సుత్తెలు, స్క్రూ డ్రైవర్లను ఉపయోగించారు. అంతా కలిసి చెక్కినా ఎక్కడా ఆకారం చెడకుండా అద్భుతంగా చిత్రీకరించారు. దాని కింద ఓనమ్ ఎట్ అంటార్కిటికా అనే అక్షరాలనూ చెక్కారు. చివరికి అంతా కలిసి ఆ ముగ్గు దగ్గర నిలబడి ఫొటోలకు పోజిచ్చారు.
- దీనికి సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘ప్రపంచంలో ఎక్కడైనా సరే భారతీయులు ఓనమ్ పండుగను జరుపుకోకుండా ఆపలేం. అది అంటార్కిటికా అయినా సరే. చాలా బాగా రంగోలీ వేశారు..’ అని కామెంట్ పెట్టారు.
- ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి లక్షల కొద్దీ వ్యూస్, లైకులు వస్తున్నాయి.
- ‘భారతీయులు అంటార్కిటికాలోనే కాదు చందమామపైనా ఓనమ్ పండుగను జరుపుకొనే సమయం దగ్గరలోనే ఉంది’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. ‘అద్భుతంగా వేశారు..’ అంటూ చాలా మంది ప్రశంసిస్తున్నారు.