మళ్లీ యుద్ధానికి రెడీ అవుతున్న వరుణ్ తేజ్!
- తన 13వ చిత్రానికి సంబంధించి అప్‌డేట్ ఇచ్చిన వరుణ్
- స్క్రిప్టు చదువుతున్న వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన యువ నటుడు
- ఈ నెల 19న చిత్రం గురించి అధికారిక ప్రకటన
ఈ మేరకు ఓ చిన్న వీడియోను వరుణ్ ఈ రోజు ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ వీడియోలో తను స్క్రిప్ట్ ను చదువుతున్నాడు. చివరి పేజీలో ‘జై హింద్’ అని కనిపించగానే.. వరుణ్ తేజ్ పెదాలపై చిరునవ్వు కనిపిస్తుంది. అనంతరం స్క్రిప్ట్ పేపర్లపై ఓ యుద్ధ విమానం బొమ్మను ఉంచి కళ్లద్దాలు పెట్టుకుని.. అతను ముందు నడుస్తుండగా.. భీకర శబ్దాలు చేస్తూ.. యుద్ధ విమానం ఎగురుతుంది. సెప్టెంబర్ 19వ తేదీన ప్రకటన అంటూ వీడియో ముగుస్తుంది.
ఇవన్నీ చూస్తుంటే వరుణ్ మరోసారి యుద్ధం నేపథ్యంలో సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో కంచె సినిమాలో అతను సిపాయిగా కనిపించాడు. ఈ సారి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో నడుస్తాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం దర్శక, నిర్మాతలు, ఇతర తారాగణం గురించి తెలియాలంటే ఈ నెల 19వ తేదీ వరకు ఆగాలి.