Adivi Sesh: 'హిట్ 2' రిలీజ్ డేట్ ఖరారు!

  • విష్వక్సేన్ హీరోగా వచ్చిన 'హిట్'
  • ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన 'హిట్ 2'
  • ఈ సినిమాకి కథానాయకుడిగా అడివి శేష్ 
  • డిసెంబర్ 23వ తేదీన సినిమా విడుదల
HIT 2 movie release date cinfirmed

నాని తన సొంత బ్యానర్లో గతంలో నిర్మించిన 'హిట్' సినిమాలో హీరోగా విష్వక్సేన్ నటించాడు. ఆ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాకి సీక్వెల్ ఉన్నట్టుగా అప్పుడే చెప్పారు. 'హిట్ 2' పేరుతో ఈ మధ్య కాలంలోనే సీక్వెల్ ను పట్టాలెక్కించారు.

ఈ సినిమాలో హీరోగా అడివి శేష్ నటించాడు. ఆయన సరసన నాయికగా మీనాక్షి చౌదరి అలరించనుంది. తాజాగా ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఏదో కేస్ ఇన్వెస్టిగేషన్ గురించి సీరియస్ గా ఆలోచన చేస్తున్నట్టుగా ఈ పోస్టర్లో అడివి శేష్ కనిపిస్తున్నాడు.

'హిట్' మొదటి భాగాన్ని అందించిన శైలేష్ కొలను, ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తుందని ఆయన చెబుతున్నాడు. 'మేజర్' తరువాత అడివి శేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోను ఆసక్తి ఉంది..

More Telugu News