Nagashourya: 'కృష్ణ వ్రింద విహారి' టైటిల్ సాంగ్ రిలీజ్!

Krishna Vrinda Vihari title sing released
షార్ట్స్‌లో చూడండి
నాగశౌర్య హీరోగా 'కృష్ణ వ్రింద విహారి' సినిమా రూపొందింది. లవ్ .. కామెడీ టచ్ తో సాగే ఫ్యామిలీ ఎంటర్టయినర్ ఇది. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, అనీష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో షిర్లే సెటియా కథానాయికగా పరిచయమవుతోంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.

తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'గుడు గుడు గుంజం గోవిందా టార్చర్ ఇట్లా ఉంటుందా .. నేనే పడ్డ ఈ గొయ్యి నా కోసం నే తవ్విందా .. కృష్ణ వ్రింద విహారి .. ఏది దారి' అంటూ ఈ పాట నడుస్తోంది. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను రామ్ మిర్యాల ఆలపించాడు. 

 ప్రేమించిన అమ్మాయి కోసం హీరో పడే పాట్లపై ఈ టైటిల్ సాంగ్ కొనసాగింది. కొంతకాలంగా వరుస ఫ్లావులతో ఉన్న నాగశౌర్య, ఈ నెల 23న విడుదల కానున్న ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. రాధిక కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, బ్రహ్మాజీ .. వెన్నెల కిశోర్ .. రాహుల్ రామకృష్ణ .. సత్య ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
Go Back to Shorts
Nagashourya
Shirle
Krishna Vrinda Vihari Movie

More Telugu News