సీఎం కాగానే పీఎం అయిపోవాలంటే ఎలా?: కేసీఆర్‌పై కేంద్ర మంత్రి నారాయణ స్వామి సెటైర్లు
- కేసీఆర్‌ది ఓ పిచ్చి కల అన్న నారాయణ స్వామి
- ఎంపీ సీట్లన్నీ గెలిచి ప్రధాని కావాలన్న పిచ్చి కలలు వదిలేయాలని సూచన
- జాతీయ పార్టీ పెట్టే ముందు రాష్ట్ర సమస్యలు పరిష్కరించాలని హితవు
సోమవారం ఓ కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా కేసీఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశంపై నారాయణ స్వామి ఘాటుగా స్పందించారు. ప్రతి ఒక్కరు ఒక ఇండిపెండెంట్‌తో, ఓ స్టేట్ పార్టీతో ఏడెనిమిది ఎంపీ సీట్లను గెలిచి ప్రధాని అయిపోవాలనుకుంటే సాధ్యపడుతుందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ దిశగా కేసీఆర్ చేస్తున్న ఆలోచనలన్నీ పిచ్చి ఆలోచనలేనని ఆయన అన్నారు. ఒక సీఎంగా ఐదేళ్లలో ఎన్ని సమస్యలు పరిష్కరిస్తానన్న ఆలోచన చేసే నేత నిజమైన నాయకుడు అని ఆయన అన్నారు.