కృష్ణంరాజుతో కలిసి రెండు సినిమాల్లో నటించా.. గొప్ప అనుభవం అది: బాలకృష్ణ
- కృష్ణంరాజు మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్న బాలకృష్ణ
- ఆయనతో తన కుటుంబానికి మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్న బాలయ్య
- ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
ఆయనతో తన కుటుంబానికి మంచి అనుబంధం ఉందన్నారు. కృష్ణంరాజు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తాను అక్కడికి వెళ్లి కలిశానని గుర్తు చేసుకున్నారు. ఆయనీ రోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్న బాలకృష్ణ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నట్టు పేర్కొన్నారు.