తెలంగాణలో బాగా తగ్గిన కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 12,934 కరోనా పరీక్షలు
- 159 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 66 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 298 మంది
- ఇంకా 1,406 మందికి పాజిటివ్
అదే సమయంలో 298 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,34,637 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,29,120 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,406 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
