కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆజాద్‌కు గ్రీటింగ్స్ చెప్పిన విజ‌య‌సాయిరెడ్డి
Add ap7am to your home Screen

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆజాద్‌కు గ్రీటింగ్స్ చెప్పిన విజ‌య‌సాయిరెడ్డి

vijay sai reddy welcomes Ghulam Nabi Azad decision to resign congress
  • శుక్ర‌వారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆజాద్‌
  • ఇప్ప‌టికైనా ఆజాద్‌కు స్వేచ్ఛ ల‌భించింద‌న్న సాయిరెడ్డి
  • ఆజాద్ సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం తీసుకున్నార‌ని కితాబు
కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ శుక్ర‌వారం రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆజాద్ రాజీనామాపై విచారం వ్య‌క్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత‌లు స్పందిస్తే... ఇత‌ర పార్టీల నేత‌లు ఈ వ్య‌వ‌హారంపై అంత‌గా స్పందించ‌లేదు. అయితే వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌యసాయిరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆజాద్ రాజీనామాపై వేగంగా స్పందించారు. కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆజాద్‌కు ఆయ‌న ఏకంగా అభినంద‌న‌‌లు తెలిపారు. ఈ మేర‌కు శుక్ర‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా సాయిరెడ్డి ఓ పోస్ట్ పెట్టారు.

'నెహ్రూ వంశం 'గులామి' (బానిసత్వం) నుంచి చిట్టచివరకు ఆయన ఆజాది (స్వేచ్ఛ)ని పొందారు' అని సాయిరెడ్డి త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆజాద్ తీసుకున్న ఈ నిర్ణ‌యం సాహ‌సోపేత‌మైన‌ద‌ని సాయిరెడ్డి కీర్తిస్తూ.. మీ మనస్సాక్షి మాట వినడంలో ఆలస్యమేమీ కూడా కాలేదంటూ పేర్కొన్నారు.
Congress
Ghulam Nabi Azad
YSRCP
Vijay Sai Reddy

More Telugu News