దేశంలో కొత్తగా 9531 కరోనా కేసులు
- ప్రస్తుతం దేశంలో 97,648 క్రియాశీల కేసులు
- వైరస్ వల్ల తాజాగా 36 మంది మృతి
- 24 గంటల్లో కోలుకున్న 11,726 మంది
గత 24 గంటల్లో 11,726 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దాంతో, దేశంలో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,37,23,944కి చేరుకుంది. రికవరీ రేటు 98.59గా ఉంది. క్రియాశీల రేటు 0.23 శాతంగా నమోదైంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా 210,02,40,361 కరోనా వ్యాక్సిన్ డోసులు అందజేశారు. నిన్న ఒక్క రోజే 35,33,466 మందికి వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.