స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూకీని హెచ్చరిస్తూ సంచలన కామెంట్స్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
- ఈ నెల 20న వస్తున్న మునావర్ ఫరూకీ
- సీతారాములపై చాలా నీచంగా మాట్లాడాడన్న రాజాసింగ్
- మళ్లీ తిట్టిపొమ్మని కొందరు ఆయనను పిలుస్తున్నారన్న బీజేపీ ఎమ్మెల్యే
- నుపుర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన వైనం
- 22న తన కామెడీ షో స్టార్ట్ అవుతుందని హెచ్చరిక
ఆయన హైదరాబాద్‌లో అడుగుపెడితే తమ రియాక్షన్ ఏంటో చూస్తారని ఇప్పటికే హెచ్చరించానని అన్నారు. మునావర్ ఏ దేవుడిని మొక్కుతాడో ఆయనపై తాను కూడా కామెంట్స్ చేస్తానంటూ నుపుర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేశారు. ఆయన మొక్కే దేవుడు చిన్న పిల్లను పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడని తాను కూడా కామెంట్ చేస్తానన్నారు. నుపుర్ శర్మ చేసిన చిన్న కామెంట్ దేశం మొత్తం పెద్ద సమస్య అయిందన్నారు. మునావర్ హైదరాబాద్‌లో కాలుపెడితే తన యాక్షన్, రియాక్షన్ చూడాల్సి ఉంటుందని, కాబట్టి అడ్డుకోవాలని డీజీపీ, పోలీస్ కమిషనర్‌లను కోరారు.