జర్నలిస్టుల సంక్షేమానికి రూ.10 ల‌క్ష‌ల విరాళ‌మిచ్చిన వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి
Add ap7am to your home Screen

జర్నలిస్టుల సంక్షేమానికి రూ.10 ల‌క్ష‌ల విరాళ‌మిచ్చిన వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

ysrcpp leader vijay sai reddy handed 10 lacks rupees cheque to journlaist welfare
  • టీయూడ‌బ్ల్యూజే ఢిల్లీ యూనియ‌న్‌కు చెక్కు అందించిన సాయిరెడ్డి
  • జ‌ర్న‌లిస్టుల‌కు ఏ ఆప‌ద వ‌చ్చినా ఆదుకుంటామ‌ని హామీ
  • జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం త‌మ పార్టీ కృషి చేస్తోంద‌ని వెల్ల‌డి
జ‌ర్న‌లిస్టుల సంక్షేమానికి వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి త‌న వంతుగా రూ.10 ల‌క్ష‌ల విరాళాన్ని అందించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆయ‌న ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో ఢిల్లీ టీయూడ‌బ్ల్యూజే యూనియ‌న్ స‌భ్యుల‌కు విరాళం చెక్కును అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ జ‌ర్న‌లిస్టుల‌కు ఏ ఆప‌ద వ‌చ్చినా ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. వైసీపీ ఆది నుంచి జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న విష‌యాన్ని గుర్తు చేసిన సాయిరెడ్డి... త‌న వంతుగా ఈ విరాళాన్ని అందిస్తున్న‌ట్లు తెలిపారు.
YSRCP
Vijay Sai Reddy
TUWJ
Journalists
Journlist Welfare

More Telugu News