డీజే టిల్లు పాటకు కాలు కదపకుండానే స్టెప్పులేసిన మంత్రి తలసాని... వీడియో ఇదిగో
- స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో రన్
- రన్‌ను ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి తలసాని
- వామప్ కోసమంటూ డిజే టిల్లు పాటను ప్లే చేసిన నిర్వాహకులు
- చేతులు ఊపుతూ ఉత్సాహంగా కనిపించిన మంత్రి
ఈ పాట మొదలు కాగానే... సాధారణ పౌరులతో పాటు రన్‌కు హాజరైన పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా పాటకు అనుగుణంగా స్టెప్పులేయడం మొదలెట్టారు. వారిని చూసిన మంత్రి తలసాని కూడా చేతులు ఊపుతూ ఉల్లాసంగా కనిపించారు. అయితే కాలు ఏమాత్రం కదపకుండానే... ఉన్న చోటునే నిలబడి తలసాని ఈ పాటకు స్టెప్పులేయడం గమనార్హం. సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన ఈ వీడియో వైరల్‌గా మారింది.