దేశంలో కాస్త తగ్గిన కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 18,738 కేసులు నమోదు
- తాజాగా 48 మంది మృతి
- ప్రస్తుత క్రియాశీల కేసులు 1,34,933
ఇప్పటిదాకా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,34, 84, 110కి చేరుకుంది. రికవరీ రేటు 98.50 శాతంగా నమోదైంది. ప్రస్తుతం దేశంలో 1,34,933 క్రియాశీల కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 0.31 శాతంగా ఉంది. గత వారంతో పోలిస్తే పాజిటివిటీ రేటు 4.63 శాతం నుంచి 5.02 శాతంకు పెరిగింది. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 206.21 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.