హాలీవుడ్ చిత్రం సీక్వెల్‌లో ధనుష్
- ద గ్రే మేన్ చిత్రంలో నటించిన సౌత్ హీరో
- తొలి భాగంలో పాత్ర నిడివి తక్కువగా ఉందని ధనుష్ అభిమానుల అసంతృప్తి
- రెండో పార్టులో బలమైన కథ ఉందన్న దర్శకులు
మొదటి భాగంలో అతని పాత్రకి అంతే అవకాశం ఉందని, రెండో పార్టులో ధనుష్ క్యారెక్టర్ అదిరిపోతుందని దర్శకులు రూసో బ్రదర్స్ అంటున్నారు. మొదటి భాగంలో ధనుష్‌ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయామని, అందుకు తాము కూడా ఫీలవుతున్నామన్నారు. హీరో గాస్లింగ్‌తో సమానమైన ప్రతిభ ఉన్న నటుడు ధనుష్ కొనియాడారు. రెండో భాగంలో తనకంటూ ఓ బలమైన కథ ఉంటుందన్నారు. కచ్చితంగా అందరూ ఆనందపడేలా తన పాత్ర ఉండబోతోందని రూసో బ్రదర్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈ లెక్కన ‘ద గ్రే మేన్’ సీక్వెల్‌లో ధనుష్ నటిస్తున్నాడని తెలిసింది. ఈ విషయాన్ని ధనుష్ కూడా స్పష్టం చేశాడు. అవిక్ సాన్ అలియాస్ ది లోన్ వోల్ఫ్‌గా తన పాత్రను తిరిగి పోషిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. రాబోయే చిత్రానికి సంబంధించిన కథాంశాన్ని సూచించే ప్రత్యేకమైన ఆడియో క్లిప్‌ను కూడా పోస్ట్ చేశాడు.