Prithvi: జనసేనలోకి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి

Actor Prudhvi to join Janasena
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ టాలీవుడ్ కమెడియన్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఈరోజు జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబును ఆయన కలిశారు. జనసేనలో చేరబోతున్నట్టు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. 

ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్షలో ఉన్నారు. ఆయన దీక్ష ముగియగానే ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో పృథ్వి జనసేన కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేన తరపున బరిలోకి దిగాలనుకుంటున్నారు. తన స్వస్థలం తాడేపల్లిగూడెం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. 

గత ఎన్నికల సమయంలో వైసీపీకి పృథ్వి మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన పూర్తి స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించారు. అందుకు ప్రతిఫలంగా ఆయనను జగన్ ఎస్వీబీసీ ఛైర్మన్ గా చేశారు. అయితే, ఓ మహిళతో రాసలీలలు నడిపించారనే ఆరోపణలతో ఆయనను పదవి నుంచి తొలగించారు.  
Go Back to Shorts
Prithvi

More Telugu News