ఎన్నికల్లో భార్యలు గెలిస్తే, భర్తలు ప్రమాణస్వీకారం చేశారు!
- మధ్యప్రదేశ్ లో ఓ ఘటన
- దమోహ్ జిల్లాలో గైసాబాద్ పంచాయతీకి ఎన్నికలు
- సర్పంచ్ గా నెగ్గిన మహిళ
- వార్డు మెంబర్లుగా నెగ్గిన ఇతర మహిళలు
దీనిపై జిల్లా కలెక్టరేట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి నివేదిక అందించాలంటూ అధికారులను ఆదేశించింది. ఈ వ్యవహారంపై గ్రామ పంచాయతీ సీఈవో అజయ్ శ్రీవాస్తవ స్పందిస్తూ, గెలిచినవారికి బదులు మరొకరు ప్రమాణం చేయడం నిబంధనలకు విరుద్ధమని, శాఖాపరమైన విచారణ జరుగుతోందని, తప్పు చేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని వెల్లడించారు.