'బింబిసార', 'సీతారామం' గురించి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది.. ఇది కదా కావాల్సింది: అడివి శేష్
- ఈరోజు థియేటర్లలో విడుదలైన 'బింబిసార', 'సీతారామం'
- ఈ చిత్రాలు హిట్ కావడంపై సంతోషం వ్యక్తం చేసిన అడివి శేష్
- కరోనా వల్ల తాను ఐసొలేషన్ లో ఉన్నానని వెల్లడి
ఈ చిత్రాలు హిట్ కావడం సంతోషంగా ఉందని అన్నారు. కరోనా వచ్చి ప్రస్తుతం తాను ఐసొలేషన్ లో ఉన్నానని... అందుకే తాను థియేటర్లకు వచ్చి సినిమాలు చూడలేకపోతున్నానని... తన కోసం మార్నింగ్ షోలో ఒక సినిమా, మ్యాట్నీలో మరో సినిమా కుమ్మేయండి అంటూ అభిమానులకు సూచించారు. మరోవైపు, అడివి శేష్ కు కరోనా అని తెలియడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.