Raghu Rama Krishna Raju: గోరంట్ల మాధవ్ చూపిస్తున్న వీడియోకు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు సంబంధం లేదు: రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju response on Gorantla Madhav nude video
  • రెండు వీడియోలను వేరే రాష్ట్రంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలన్న రఘురాజు  
  • అప్పుడే ఏది ఒరిజినల్ అన్నది తేలుతుందని వ్యాఖ్య 
  • న్యూడ్ వీడియో వ్యవహారంపై జగన్ వెంటనే స్పందించాలి
ఒక యువతితో న్యూడ్ వీడియోలో మాట్లాడారంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఆరోపణలు రావడంతో సదరు ఎంపీ మాధవ్ వాటిని ఖండించారు. అది మార్ఫింగ్ చేసిన వీడియో అంటూ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియోను మీడియాకు చూపించారు. ఒక కుట్ర ప్రకారమే తనపై ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు

మరోవైపు ఈ అంశంపై, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ... గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు... మీడియాకు గోరంట్ల మాధవ్ చూపించిన వీడియోకు అసలు సంబంధమే లేదని అన్నారు. వీటిలో ఏది ఒరిజినల్ వీడియో అనేది తేలాలంటే.... రెండు వీడియోలను వేరే రాష్ట్రంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలని చెప్పారు. అప్పుడే అసలు విషయం బయటపడుతుందని అన్నారు. పార్లమెంటు సాక్షిగా గోరంట్ల మాధవ్ తనను బెదిరించే ప్రయత్నం చేశారని చెప్పారు. ఈ న్యూడ్ వీడియో వ్యవహారంపై సీఎం జగన్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
Raghu Rama Krishna Raju
Gorantla Madhav
Jagan
YSRCP
Nude Video

More Telugu News