జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసాకు ఎన్నారైల సాయం రూ.50 లక్ష‌లు
Add ap7am to your home Screen

జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసాకు ఎన్నారైల సాయం రూ.50 లక్ష‌లు

nris donates 50 lack rupees for janasena koulu raithu bharosa
  • ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌కు అండ‌గా జ‌న‌సేన‌
  • చ‌నిపోయిన కౌలు రైతుల కుటుంబాల‌కు రూ.1 ల‌క్ష చొప్పున సాయం
  • కౌలు రైతు భ‌రోసాకు రూ.50 ల‌క్ష‌ల ఇచ్చిన ఎన్నారైలు
  • ప‌వ‌న్‌, నాగ‌బాబుల‌కు చెక్కు అంద‌జేత‌
సాగు క‌లిసిరాక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌ను ఆదుకునేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కౌలు రైతు భ‌రోసా పేరిట ఓ ప్ర‌త్యేక కార్యక్ర‌మాన్ని చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌కు రూ.1 ల‌క్ష చొప్పున జ‌న‌సేన సాయం అంద‌జేస్తోంది. ఇందుకోసం ప‌వ‌న్ కల్యాణ్ త‌న వ్య‌క్తిగ‌త హోదాలో రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే ఏపీలోని ప‌లు జిల్లాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ కార్య‌క్ర‌మానికి ఎన్నారైల నుంచి భారీ సాయం అందింది. మంగ‌ళ‌వారం రాత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిసిన తెలుగు నేల‌కు చెందిన ప‌లువురు ఎన్నారైలు రూ.50 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌న‌సేన పీఏసీ స‌భ్యుడు నాగ‌బాబు కూడా పాల్గొన్నారు.
Janasena
Pawan Kalyan
Koulu Raithu Bharosa
NRI

More Telugu News