India: దేశంలో కొత్తగా 13 వేలకు పైగా కరోనా కేసుల నమోదు.. అప్డేట్స్ ఇవిగో!

India corona updates
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 13,734 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 17,897 మంది కరోనా నుంచి కోలుకోగా... 34 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,39,792 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక ఇప్పటి వరకు మొత్తం 5,26,430 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం క్రియాశీల రేటు 0.32 శాతంగా, రికవరీ రేటు 98.49 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,04,60,81,081 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 26,77,405 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 
Go Back to Shorts
India
Corona Virus

More Telugu News