రాష్ట్రప‌తి ముర్ముతో చీఫ్ జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ దంపతులు... ఫొటో ఇదిగో

cji justice nv ramana meets draupadi murmu in rashtrapati bhavan
  • స‌తీస‌మేతంగా రాష్ట్రప‌తి భ‌వ‌న్ వెళ్లిన జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌
  • ద్రౌప‌ది ముర్ముకు అభినంద‌న‌లు తెలిపిన వైనం
  • ముర్ముకు ప‌లువురు గ‌వ‌ర్న‌ర్లు, కేంద్ర మంత్రుల అభినంద‌న‌లు
భార‌త రాష్ట్రప‌తిగా ఇటీవ‌లే ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన ద్రౌప‌ది ముర్మును సోమ‌వారం రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో ప‌లువురు ప్ర‌ముఖులు క‌లిశారు. భార‌త రాష్ట్రప‌తిగా ఎన్నికైనందుకు ఆమెకు అభినంద‌న‌లు తెలిపారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ స‌తీ స‌మేతంగా సోమ‌వారం సాయంత్రం రాష్ట్రప‌తి భ‌వ‌న్‌కు వెళ్లారు. రాష్ట్రప‌తి ముర్మును త‌న అర్ధాంగితో క‌లిసి ఆయ‌న అభినందించారు. ఈ ఫొటోల‌ను రాష్ట్రప‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశాయి. ఇదిలా ఉంటే... ప‌లు రాష్ట్రాల‌కు చెందిన గ‌వ‌ర్న‌ర్లు, ప‌లువురు కేంద్ర మంత్రులు కూడా సోమ‌వారం ద్రౌప‌ది ముర్మును క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు.
Go Back to Shorts
President Of India
Draupadi Murmu
Justice N.V. Ramana
Rashtrapati Bhavan

More Telugu News