India: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. అప్డేట్స్ ఇవిగో!

India reports 20409 new COVID19 cases today
షార్ట్స్‌లో చూడండి
మన దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 20,409 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 22,697 మంది కరోనా నుంచి కోలుకోగా... 47 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,43,988 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,39,79,730కి పెరిగాయి. వీరిలో 4,33,09,484 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,26,258 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం క్రియాశీల రేటు 0.33 శాతంగా, రికవరీ రేటు 98.48 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,03,60,46,307 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 38,63,960 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News