Palamuru-Rangareddy Lift Irrigation Scheme: పాలమూరు లిఫ్ట్ పనుల్లో పెను విషాదం.. క్రేన్ వైరు తెగి ఐదుగురు కూలీల దుర్మరణం

Five dead in Palamuru Rangareddy Lift Irrigation Scheme works
షార్ట్స్‌లో చూడండి
పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పనులు చేస్తున్న ఐదుగురు కూలీలు ప్రమాదవశాత్తు ఈ ఉదయం మృతి చెందారు. నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం రేగుమనగడ్డ వద్ద ఈ తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. 

రంగారెడ్డి ప్యాకేజీ-1లో పనులు చేస్తున్న కూలీలు పంప్‌హౌస్‌లోకి దిగుతున్న సమయంలో క్రేన్ వైరు ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో కూలీలు కిందపడి దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితులను బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు.
Go Back to Shorts
Palamuru-Rangareddy Lift Irrigation Scheme
Bihar
Accident
Nagarkurnool District

More Telugu News