మూడేళ్ల నుంచి ఈ యుద్ధం చేస్తూనే వున్నారు: రఘురామకృష్ణరాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడేళ్ల నుంచి ఈ యుద్ధం చేస్తూనే వున్నారు: రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju fires on Jagan
  • కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నామని జగన్ అన్నారన్న రఘురాజు
  • కేంద్రంపై వైసీపీ చేస్తున్నది తమలపాకు యుద్ధమని ఎద్దేవా
  • యుద్ధం చేసేవాళ్లు... కనిపిస్తేనే కాళ్లు పట్టుకుంటారా? అని ఎద్దేవా  
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నానని జగన్ అన్నారని... ఆయన సీరియస్ యుద్ధం చేస్తున్నారా? అని ఎద్దేవా చేశారు. కేంద్రంపై వైసీపీ చేస్తున్నది తమలపాకు యుద్ధమని... మూడేళ్ల నుంచి ఈ యుద్ధం చేస్తున్నారని చెప్పారు. యుద్ధం చేసేవాళ్లు... కనిపిస్తేనే కాళ్లు పట్టుకుంటారా? అని అడిగారు. వైసీపీ ఎంపీలు పార్లమెంటులో తనపై అనర్హత వేటు వేయాలనే బ్యానర్ తప్ప ఇతర బ్యానర్ పట్టుకున్నారా? అని విమర్శించారు. తమ పార్టీ వైఖరి నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుందని అన్నారు.
Raghu Rama Krishna Raju
Jagan
YSRCP

More Telugu News