ముద్దుల మామయ్య అమ్మ ఒడిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా?: నాగబాబు విమర్శలు
- ఇటీవల ముద్దుల మామయ్య అంటూ సంబోధించిన పవన్
- ఏపీలో పెద్ద సంఖ్యలో స్కూళ్ల మూసివేత
- తాజాగా ముద్దుల మామయ్యా అంటూ నాగబాబు వ్యాఖ్యలు
'ఏపీలోని దాదాపు 8 వేల స్కూళ్లను మూసివేయడం ద్వారా ముద్దుల మామయ్య అమ్మ ఒడిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా?' అని నిలదీశారు. లేక, ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేయడానికా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు వైసీపీ నాయకత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 711 పాఠశాలలను మూసివేసిన వైసీపీ సర్కారు అక్కడున్న చిన్నారుల భవిష్యత్తును ఏం చేయాలనుకుంటోంది అంటూ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.